విత్తన శుద్ధి :
విత్తన శుద్ధిని రెండుసార్లు చేసుకోవచ్చు. మొదటిసారి విత్తన శుద్ధి చేసుకొని ఆరబెట్టిన తరువాత నిడ ప్రదేశంలో కుప్పలాగా పోసి నిలువ వుంచుకోవాలి.
రెండుసారి విత్తనశుద్ది నట్టేటపుడు చేసుకోవాలి. విత్తన శుద్ధి చేసేటపుడు మొలక విరగకుండా జాగ్రత్త వహించాలి.
ఒకేసారి చేయాలనుకుంటే విత్తనం ఎంపిక చేసుకొని శుద్ధి చేసి నిలువ వుంచుకోవడమే మంచిది. దీని కొరకు బలమైన, మొలకెత్తిన మొగ్గలు గల పిల్ల కొమ్ములను ఎంచుకోవాలి.
విత్తన శుద్ధి చేయుటం వలన విత్తనం ద్వారా సంక్రమించే దుంప, వేరుకుళ్ళు తాటాకు తెగులు, ఆకుమచ్చ తెగ్గుళ్ళకు కారణమైన శలింద్రాలు నాశనమవుతాయి.
భూమిలోని హానికర శలింద్రాలు కొంతకాలం వరకు విత్తనాన్ని ఆశించవు.
ఇదుకని లీటరు నీటికి 3 గ్రాముల రెడోమిల్ యం.జెడ్ లేదా 3 గ్రాముల మాoకోజేబ్ కలిపి ద్రావణంలో 40 నిమిషాల సేపు వుంచి, బయటకు తీసి, నీడలో ఆరబెట్టి తరువాత నాటుకోవాలి.
విత్తన పసుపుకు పొలుసుపురుగులు ఆశించి వుంటే శలింద్రనాశినితో పాటు లీటరు నీటికి 3- 5 మి.లీ. మలధీయాన్ లేదా 2 మి.లీ. మొనోక్రోటోపాస్ మందు కలిపితే మంచిది.
తరువాత నీటిని ఆరబెట్టి నిరుకు మార్చి లీటరు నీటికి 5 గ్రా.ల ట్రైకోడెర్మ విరిడి చొప్పున కలిపి ఆ ద్రావణంలో దుంపలను ముంచి ఆరబెట్టాలి.